తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పొడిగా మారిపోయింది. నవంబర్ 8 న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. తెలంగాణకు ఎలాంటి వర్ష సూచన, హెచ్చరికలు లేవు మరో రెండు రోజులపాటు వాతావరణంలో ఏ మార్పులు ఉండవని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ లో అత్యధికంగా 33.8 డిగ్రీల ఉష్ణోగ్రత, మెదక్ లో అత్యల్పంగా 13 డిగ్రీలు నేడు ఉత్తర కోస్తాంధ్రలో, యానాంలో ఎలాంటి వర్ష హెచ్చరికలు లేవు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో పొడిగా వాతావరణం ఉభయ గోదావరి, ఏలూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతోంది చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం అల్పపీడనం ఏర్పడ్డాక మూడు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి