బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి.

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి

అక్టోబర్ 20న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.

అక్టోబర్ 22న తుఫానుగా మారే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.

ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో నేడు వర్షాలు

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉంది

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో నేడు అక్కడక్కడ వర్షాలు

ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో మోస్తరు వర్షాలు పడతాయి

గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల వర్షాలున్నాయి

చిత్తూరు టౌన్ తో పాటు పాకాల​, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది