ఉపరితల ఆవర్తనం బలపడి తేలికపాటి అల్పపీడనంగా మారింది. మరో 2 రోజులు వర్షాలు

ఈ నెల 17 లేదా 18న ఉత్తర అండమాన్‌ సముద్రంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది.

నేడు సైతం పలు జిల్లాలకు వర్ష సూచనతో అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు ఎల్లో అలర్ట్ జారీ చేశాయి.

కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు

హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ, కొనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాలు

అనకాపల్లి పెందుర్తి, వైజాగ్ చుట్టుపక్కనే ఉన్న ప్రాంతాల్లో వర్షాలు అధికంగా ఉంటాయి.

కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల​, ప్రకాశం, పలుచోట్ల వర్షాలు పడతాయి

నెల్లూరు పశ్చిమ భాగాల్లోని ప్రాంతాలు, తిరుపతి జిల్లా గూడూరు ప్రాంతంలో మోస్తరు వానలు

కడప జిల్లాలోని పలు భాగాలు, అన్నమయ్య జిల్లాలోని పలుచోట్ల వర్షాలున్నాయి