అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్ష సూచనతో అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు ఎల్లో అలర్ట్ జారీ చేశాయి ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్ 15 ఏపీలోకి ప్రవేశించనున్నాయి ఆదిలాబాద్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడితే, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కోస్తాంధ్ర జిల్లాలైన కొనసీమ, ఏలూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాలు పడతాయి. విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం జిల్లాల్లో మోస్తరు వర్ష సూచన బాపట్ల, ఉత్తర ప్రకాశం, కృష్ణా, ఎన్.టీ.ఆర్. జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి అనంతపురం, కర్నూలు, సత్యసాయి జిల్లాలోని పశ్చిమ భాగాలలో భారీ వర్షాలున్నాయి