బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తమిళనాడు, శ్రీలంక మీదుగా కొనసాగుతోంది. నేటి నుంచి నాలుగు రోజులపాటు దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా, రాత్రివేళ చలి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో నేటి నుంచి మూడు, నాలుగు రోజులపాటు తేలికపాటి వర్షాలున్నాయి హైదరాబాద్ లో ఆకాశాన్ని పాక్షికంగా మేఘాలు కమ్మేశాయి. ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. నవంబర్ 1 నుంచి నాలుగు రోజులపాటు ఏపీలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. విశాఖ, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి నగరాల్లో తేలికపాటి వర్షాలున్నాయి. శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సాధారణ వర్షపాతం అత్యధికంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలున్నాయి. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు అనంతపురం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి