నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు అల్పపీడనం రేపు వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈశాన్య రుతుపవనాలు నేడు ఏపీలోకి ప్రవేశించనున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. తెలంగాణలో వాతావరణం పొడిగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 30 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలుగా నమోదైంది. హైదరాబాద్ లో ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. ఉపరితల ఆవర్తనం తమిళనాడు తీరంలో ఉండటంతో కోస్తాంధ్ర జిల్లాలపై ప్రభావం ఉంటుంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఒకట్రెండు చోట్ల చిరుజల్లులు గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి జల్లులు అన్నమయ్య, చిత్తూరు జిల్లాలోని పలుచోట్ల వర్షాలున్నాయి