రాగి దోశ రెసిపీ, బరువు తగ్గడం ఖాయం

రాగి దోశ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ఆరోగ్యకరమైనది.

దీన్ని చేయాల్సిన పద్ధతిలో చేస్తే ఆ రుచే వేరు. ఎలా చేయాలో ఓసారి చూడండి.

గిన్నెలో రాగిపిండి ఒక కప్పు, బొంబాయి రవ్వ ఒక కప్పు, బియ్యం పిండి అరకప్పు వేసి బాగా కలుపుకోవాలి.

ఆ పిండిలో నీళ్లు పోసి బాగా కలపాలి.

ఆ మిశ్రమంలో ఉల్లిపాయ తరుగు, జీలకర్ర, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి.

రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.

పిండి గట్టిగా కాకుండా దోశెలు వేసేందుకు వీలుగా జారుతున్నట్టు కలుపుకోవాలి.

ఓ పావు గంటసేపు అలా వదిలేయాలి. తరువాత అవసరం అయితే నీళ్లు కలుపుకోవాలి.

పెనం వేడెక్కాక పలుచటి దోశలా పోసుకోవాలి.

ఈ దోశెలను చట్నీ లేకుండా తిన్నా కూడా టేస్టీగానే ఉంటాయి. పుదీన చట్నీతో తింటే ఇంకా రుచిగా అనిపిస్తాయి.