జగద్గుర ఆదిశంకరాచార్యులు భిక్ష కోసం ఒక పేదబ్రాహ్మణుని ఇంటికి వెళ్ళారట. కటిక దరిద్రంతో బాధపడుతున్నఆ ఇల్లాలు దిక్కు తోచని స్థితిలో ఇంట్లో వెతికితే ఒక ఉసిరికాయ కనిపించింది. ఆ ఉసిరి కాయను దానం చేసింది ఆ మహాతల్లి.
అది చూసి చలించిపోయిన ఆదిశంకరులు వారి దారిద్ర్యాన్ని తొలగించమని లక్ష్మీదేవిని ప్రార్థించారు. ఆ సమయంలో ఆశువుగా వచ్చినదే కనకధారాస్తవము అనే మహోత్తరమైన స్తోత్రం. వెంటనే ఆ పేద బ్రాహ్మణి ఇంట బంగారు ఉసిరికాయల వర్షం కురిసింది.