మే 3 మంగళవారం రాశిఫలాలు:
ఈ రాశివారు ఏం అనుకున్నా జరిగిపోతాయ్



మేషం
ఈ రోజు మీకు మంచి రోజు. ఓ శుభవార్త వింటారు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. నిరుద్యోగులు ఇంటర్యూల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి మాటలకు విలువ ఇవ్వండి.



వృషభం
అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. ఈ రోజు మీరు మీతో బిజీగా ఉంటారు. ఓ శుభవార్త వినడం కోసం ఎదురుచూస్తుంటారు. వ్యాపారంలో అద్భుతమైన పురోగతి ఉంటుంది.



మిథునం
విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. అప్పులు చేయకండి. కార్యాలయంలో మీ ఆధిపత్యం తగ్గుతుంది. కొన్ని ప్రతికూల వార్తలు వినే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.



కర్కాటకం
కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. పిల్లల వృత్తికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. పాత మిత్రులను కలుసుకోవడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు చేస్తారు. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది



సింహం
ఎక్కువ పని కారణంగా తొందరగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఈ రోజు సానుకూలంగా ఉంటారు. వ్యాపారులకు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. కార్యాలయంలో జఠిలమైన వ్యవహారాలను పరిష్కరిస్తారు.



కన్యా
ఈ రోజు మీరు మానసిక గందరగోళంలో ఉంటారు. ఎక్కువ ఖర్చు చేస్తారు. పిల్లలు ఎదుర్కొనే సమస్యలు తొలగిపోతాయి. ఇతరుల బాధ్యతలను కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు అన్ని పనులు మీరు అనుకున్న విధంగానే జరుగుతాయి.



తులా
ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. మిమ్మల్ని ఉపయోగించుకుని వేరేవ్యక్తులు ప్రయోజనం పొందుతారు. మీ వ్యక్తిత్వంతో అందర్నీ ఆకట్టుకుంటారు. మహిళలు తమ ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలి. కార్యాలయంలో ఆకస్మిక మార్పు ఉంటాయి.



వృశ్చికం
గతంలో మీరు పడిన కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు అందుకుంటారు. ప్రయాణాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారంలో కొత్త సహచరులను చేర్చుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు.



ధనుస్సు
ఈ రాశి వారు అధిక ఖర్చులను నివారించాలి. ఆధ్యాత్మిక చర్చలు మీ దృక్పథాన్ని మార్చుతాయి. హైపర్ టెన్షన్ రోగులు కోపం తెచ్చుకోకుండా ఉండాలి. ఈ రోజు మీ వ్యాపారం సాధారణంగా కొనసాగుతుంది.



మకరం
విద్యారంగంతో అనుబంధం ఉన్న వారికి చాలా మంచి రోజు. మీరు కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. ప్రభుత్వ పనుల్లో వచ్చే సమస్యలు తొలగిపోతాయి. ఫ్యూచర్ ప్రణాళికలు వేసుకుంటారు.



కుంభం
అధికారుల తీరు పట్ల అసంతృప్తికి లోనవుతారు.మీ ఆర్థిక స్థితి పెరుగుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండండి. ఈ రోజు మీ పని మరియు బాధ్యతల నుంచి తప్పించుకోవాలి అనుకోవద్దు. శారీరక, మానసిక శక్తిలో స్వల్ప తగ్గుదల ఉంటుంది.



మీనం
ఈ రోజు పిల్లలతో సంతోషంగా గడుపుతారు. ఎవరికీ సలహా ఇవ్వకండి. మీరు ప్రభావవంతమైన వ్యక్తి నుంచి ప్రోత్సాహాన్ని పొందుతారు. మీ ప్రయత్నాలు మిమ్మల్ని మరో మెట్టు ఎక్కిస్తాయి. మీ సలహాతో ప్రయోజనం పొందేవారి సంఖ్య పెరుగుతుంది.