మూడ్ బాగోలేదా ఇలా చేయండి కొన్ని సంఘటనలు బాధిస్తాయి. చాలా డిప్రెస్ అనిపించేలా చేస్తాయి. అలాంటప్పుడు మిమ్మల్ని మీరే రీఫ్రెష్ చేసుకోవాలి. ఏం చేయాలంటే... మీ బాధ వినే వ్యక్తికి ఫోన్ చేసి మనుసులో మాటలను పంచుకోండి. మిమ్మల్ని మీరు ఛీర్ అప్ చేసుకోవాలి. అందుకు మేకప్ చేసుకుని అందంగా అలంకరించుకోవాలి. వ్యాయామం బాధను తగ్గిస్తుంది. ఓ గంటపాటూ బయట వాకింగ్ కు వెళ్లండి. స్పూర్తివంతమైన వ్యాఖ్యలతో నిండిన పుస్తకాన్ని ఓ గంట పాటూ చదవండి. డైరీలో మీ మనసులో ఉన్నదంతా రాసేయండి. తేలికగా అనిపిస్తుంది. మొక్కల పని కాసేపు చేయండి. ప్రశాంతంగా ఉంటుంది. సెలూన్‌కి వెళ్లి హెయిర్ స్టైల్ మార్చుకోండి. మీకు మీరే కొత్తగా కనిపిస్తారు.