టాలీవుడ్ బ్యూటీ రాశిఖన్నా ఎయిర్‌పోర్టులో ఫొటోగ్రాఫర్లకు కనిపించింది. పింక్ జీన్స్, గ్రే టీషర్ట్‌లో క్యాజువల్‌గా కనిపించిన రాశిని ఫొటోగ్రాఫర్లు కెమెరాల్లో బంధించారు. ఇటీవలే ‘ఫర్జీ’ వెబ్ సిరీస్‌తో రాశి ఖన్నా దేశవ్యాప్తంగా ఫేమస్ అయింది. ఇది తనకు రెండో వెబ్ సిరీస్. అంతకు ముందు అజయ్ దేవ్‌గణ్‌త్ ‘రుద్ర’ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. ప్రస్తుతం తన చేతిలో ‘యోధ’ అనే సినిమా ఉంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నాడు. గతేడాది ‘థాంక్యూ’, ‘పక్కా కమర్షియల్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. కానీ అవి రెండూ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి. తమిళంలో నటించిన ‘తిరుచిత్రాంబళం’, ‘సర్దార్’ సినిమాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయి.