ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నేటితో 40వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. విజయ్ సేతుపతి, కార్తీక్ సుబ్బరాజ్, బాబీ సింహా ఒకేసారి కెరీర్ ప్రారంభించారు. కార్తీక్ సినిమాలపై ఓ లుక్కేద్దాం. కార్తీక్ సుబ్బరాజ్ సినిమా ‘పిజ్జా’ సినిమాతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2014లో ‘జిగర్తాండా’ సినిమా చేశారు. 2016లో వచ్చిన ‘ఇరైవి’ కార్తీక్ సుబ్బరాజ్ మూడో సినిమా. ప్రభుదేవాతో ‘మెర్క్యురీ’ అనే ప్రయోగాత్మక సినిమా తెరకెక్కించారు. తన ఫేవరెట్ హీరో రజనీకాంత్‌తో 2019లో ‘పేట’ సినిమా తీశారు. ధనుష్‌తో చేసిన ‘జగమే తంత్రం’ ఓటీటీలో విడుదల అయింది. విక్రమ్, ధ్రువ్ విక్రమ్‌లతో తీసిన మహాన్ కూడా ఓటీటీలోనే విడుదల అయింది.