ఉపేంద్ర నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కబ్జ’. ఈ సినిమా కథ 1945 నుంచి 1975 మధ్య కాలంలో జరుగుతుంది. అర్కేశ్వర (ఉపేంద్ర) పైలట్ కావాలనే లక్ష్యంతో ఉంటాడు. తన జీవితంలో ఎటువంటి మార్పులు జరిగిందో సినిమాలో చూడవచ్చు. భార్గవ్ బక్షి (సుదీప్), గుర్తు తెలియని పాత్ర పోషించిన శివరాజ్ కుమార్‌ల పాత్రలు మిస్టరీ. పూర్తిగా కేజీయఫ్ అనుకరణతో వచ్చిన సినిమా ‘కబ్జ’. సినిమా చాలా స్లోగా నడుస్తుంది. సెట్లు, మ్యూజిక్, డైలాగులు, ఎడిటింగ్ అన్నీ కేజీయఫ్‌ను గుర్తు చేస్తాయి. కొన్ని పాత్రలకు చెప్పించిన డబ్బింగ్ కూడా సరిగ్గా లేదు. ఏబీపీ దేశం రేటింగ్ : 2/5