షారుక్ ఖాన్ లేటెస్ట్ సినిమా ‘పఠాన్’ జనవరి 25న విడుదల అయింది. మార్చి 15వ తేదీతో బాక్సాఫీస్ వద్ద 50 రోజులను పూర్తి చేసుకుంది. అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ సినిమా రికార్డును కూడా బద్దలుకొట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కేవలం హిందీ వెర్షన్ రూ.521 కోట్ల నెట్‌ను సాధించింది. ఇంకా 20 దేశాల్లో పఠాన్ ఆడుతూనే ఉంది. భారత దేశంలో 800 స్క్రీన్లలో పఠాన్ 50 రోజులు పూర్తి చేసుకుంది. అలాగే విదేశాల్లో 135 స్క్రీన్లలో ప్రదర్శితం అవుతుంది. ఈ సినిమాలో షారుక్ ఖాన్ సరసన దీపికా పడుకోనే నటించింది. ప్రతి నాయక పాత్రలో జాన్ అబ్రహాంను చూడవచ్చు.