ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో ‘పుష్ప 2’ ఒకటి.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి

ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు.

కానీ ఈ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి.

వీటిని ఖండిస్తూ సినిమా టీమ్ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది.

ఈ పోస్టర్‌లో సినిమా 200 రోజుల్లో విడుదల కానుందని ప్రకటించారు.

ఒకవేళ ‘పుష్ప 2’ వాయిదా పడితే ఆరోజు జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ వస్తుందని వార్తలు వస్తున్నాయి.

నాని ‘సరిపోదా శనివారం’ టీమ్ కూడా ఆ డేట్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది.

కానీ ‘పుష్ఫ 2’ టీమ్ ఒక్క పోస్టర్‌తో ఆ రూమర్స్‌కు చెక్ పెట్టేసింది.