ప్రొటీన్ షేక్‌తో ప్రాణాలు పోతాయ్



ప్రోటీన్ షేక్ తాగడం వల్ల కండలు బలిష్టంగా అవుతాయని, బాడీ మంచి షేప్ వస్తుందని ఎంతోమంది నమ్మకం.



కానీ కొందరిలో ఇది ట్రిగ్గర్‌గా పనిచేస్తుంది. అరుదైన వ్యాధులు వచ్చి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా సంభవించవచ్చు.



బ్రిటన్ కు చెందిన టీనేజర్ రోహన్ ప్రొటీన్ షేక్ తాగాక ఆరోగ్యం క్షీణించింది. కడుపునొప్పి, వాంతులు వచ్చాయి.



తీవ్రమైన మెదడు వాపు వ్యాధి బారిన పడి రోహన్ మరణించాడు.



ప్రోటీన్ షేక్ తాగడం వల్ల ఆ అబ్బాయిలో ఆర్నిథైన్ ట్రాన్స్‌కార్బమైలేస్ లోపం వచ్చింది.



అదొక ఎంజైమ్. దీని లోపం వల్ల ఆరోగ్యం క్షీణించింది.



ప్రొటీన్ షేక్ అనేది ఈ అరుదైన పరిస్థితి తలెత్తడానికి ట్రిగ్గర్ గా మారిందని వివరించారు వైద్యులు.



ప్రోటీన్ షేక్ అధికంగా తాగితే అనేక రకాల సైడ్ ఎఫెక్టులు ఉంటాయని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి.