వంటసోడాతో ఇలా చేస్తే జుట్టు సూపర్ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వంటసోడాను ఉపయోగించుకోవచ్చు. వాతావరణం చల్లబడితే చాలు జుట్టు సమస్యలు మొదలైపోతాయి. చుండ్రు పట్టేస్తుంది. నీళ్లలో వంటసోడా కలిపి మాడుకి పట్టించండి. చేత్తో సున్నితంగా మర్ధనా చేయండి. గోరువెచ్చటి నీటితో కడిగేస్తే చుండ్రు, మురికి పోతాయి. చుండ్రు వల్లే జుట్టు రాలిపోతాయి. దురద వేధిస్తుంది. వంటసోడాతో వీటికి చెక్ పెట్టవచ్చు. కలబంధ గుజ్జులో వంటసోడా కలిపి జుట్టుకు పట్టించాలి. తరువాత స్నానం చేసేయాలి. ఇలా చేస్తే మాడుకు రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. తలస్నానానికి పదినిమిషాల ముందు వంటసోడా, నిమ్మరసం కలిపి తలకు పట్టించాలి. తరువాత కడిగేస్తే చుండ్రు పోతుంది. పెరుగులో వంటసోడా కలిపి తలకు పట్టించి ఆరనివ్వాలి. తరువాత తలకు స్నాం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే చుండ్రు రాదు. జుట్టు రాలిపోదు.