రంగురంగుల కూరగాయలు, పండ్లు ఒక గ్లాస్ రెడ్ వైన్ తో ఉండే మెడిటరేనియన్ డైట్ వల్ల మంచి నిద్ర సాధ్యమవుతుందట. కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, పాల పదార్థాలు తీసుకునే వారిలో నిద్ర బావుంటుందట. అరటి పండు తీసుకోవడం వల్ల కూడా మంచి నిద్ర వస్తుంది. రోజుకు పది బాదం గింజలు తిన్న వారిలో నిద్రలేమి 10 శాతం వరకు తగ్గినట్లు గుర్తించారు. ఫైబర్ ఎక్కువగా ఉండే తృణధాన్యాల వినియోగం కూడా నిద్ర నాణ్యతను పెంచుతుంది. సెలీనియం, విటమిన్ బీ6 వంటి నిద్రకు కావల్సిన కీలమైన పోషకాలు కలిగిన పీతల్లో ఉంటుందట. సాలమన్ వంటి చేపల్లో ఉండే విటమిన్ డి, ఒమెగా3 వల్ల మంచి నిద్ర వస్తుంది. టోఫూ వంటి సోయ ఉత్పత్తులు ఎక్కువగా తీసుకునే వారిలో నిద్రకు లోటు లేదని ఒక జపనీస్ అద్యయనం చెబుతోంది. రైప్ గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. అందువల్ల అన్నం తినడం వల్ల త్వరగా నిద్ర వస్తుంది. Representational Image : Pexels