కడుపునప్పి గా ఉన్నపుడు పారసిటమాల్ వేసుకోవడం మంచిది.

జీర్ణాశయ లైనింగ్ కు నష్టం కలిగించే ఇబుప్రొఫెన్ కలిగిన మందులు వాడకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు.



స్టమక్ క్రాంప్స్ జీర్ణాశయం, గర్భాశయం, మూత్రనాళం లేదా పిత్తనాళం ఇలా ఎక్కడైనా మొదలు కావచ్చు.

ఇలాంటి నొప్పి కి యాంటీస్పాస్మోడిక్ మందు వేసుకుంటే త్వరగా తగ్గుతుంది. ఈ నొప్పి అకస్మాత్తుగా మొదలై తెరలు తెరలు గా వస్తుంది.

డయేరియా వల్ల వచ్చే కడుపునొప్పికి యాంటీ డైరియల్ మందులు వేసుకోవాలి.

విరేచనాలతో పాటు స్టమక్ క్రాంప్స్ కూడా యాంటీస్పాస్మోటిక్ మందులతో కలిపి వేసుకోవచ్చు.

అసిడిటి వల్ల కడుపునొప్పి వచ్చినపుడు అంటాసిడ్లు, ప్రొటాన్ పంప్ ఇన్హిబీటర్లు మంచి ఫలితాలను ఇస్తాయి.

ఇవి కడుపులో ఉండే ఆసిడ్ ప్రభావం తగ్గిస్తుంది. తరచుగా అసిడిటి వస్తుంటే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

కడుపు నొప్పి ఉన్నా లేకున్నా తగినన్ని నీళ్లు తాగడం మంచిది. హైడ్రేషన్ అవయవాలు సరిగ్గా పనిచేసేందుకు అవసరం.

తరచుగ కడుపు నొప్పితో బాధపడేవారు వీలైనంత వరకు తేలికైన ఆహారం తీసుకోవడం మంచిది.

Representational Image : Pexels and pixabay