ముద్దు ముద్దుగా అమాయకంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి... పవన్ కళ్యాణ్‌తో, ధనుష్‌తో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఓజీ'లో హీరోయిన్ ఈ అమ్మాయే. ఇప్పటికీ... ఈ అమ్మాయిని గుర్తు పట్టలేదా? ప్రియాంకా అరుల్ మోహన్ అండీ. ధనుష్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'కెప్టెన్ మిల్లర్' సినిమాలో కూడా ప్రియాంకా అరుల్ మోహన్ నటిస్తున్నారు. ప్రియాంకా అరుల్ మోహన్ లేటెస్టు ఫోటోషూట్ ఇది. పింక్ డ్రస్ లో బార్బీ బొమ్మలా మెరిశారు. తెలుగులో నాని 'గ్యాంగ్ లీడర్' సినిమాలోనూ ప్రియాంకా అరుల్ మోహన్ నటించారు. తమిళంలో ప్రియాంకా అరుల్ మోహన్ నటించిన 'వరుణ్ డాక్టర్' సినిమా తెలుగులోనూ మంచి విజయం సాధించింది. శివ కార్తికేయన్ సరసన ప్రియాంకా అరుల్ మోహన్ నటించిన రెండో సినిమా 'డాన్' కూడా తెలుగు, తమిళ భాషల్లో హిట్టే. ప్రియాంకా అరుల్ మోహన్ (All Images Courtesy : priyankaamohanofficial / Instagram)