హీరోయిన్లు స్విమ్ సూట్ వేయడం, విదేశాల్లో సందడి చేయడం మామూలే. మరి, ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? నీలకంఠ దర్శకత్వం వహించిన రీసెంట్ సినిమా 'సర్కిల్'లో కూడా నటించిందీ సుందరి. ఇంకా ఈ అమ్మాయి ఎవరో గుర్తు రాలేదా? అదేనండీ... ఈవిడ రిచా పనయ్! 'అల్లరి' నరేష్ సరసన నటించిన 'యముడికి మొగుడు'తో తెలుగు తెరకు రిచా పనయ్ పరిచయం అయ్యారు. 'చందమామ కథలు', 'లవ కుశ' సినిమాల్లో కూడా రిచా పనయ్ నటించారు. సునీల్ 'ఈడు గోల్డ్ ఎహే', 'రక్షక భటుడు' సినిమాల్లో రిచా పనయ్ గ్లామరస్ రోల్స్ చేశారు. ప్రస్తుతం రిచా పనయ్ విదేశాల్లో ఉన్నారు. అక్కడ సముద్ర తీరాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. కథానాయికగా రిచా పనయ్ కెరీర్ ఆశించిన రీతిలో ముందుకు సాగడం లేదని చెప్పాలి. రిచా పనయ్ (Image Courtesy : richapanai / Instagram)