జుట్టుకు రంగేసుకోవడం లేదా బ్లీచ్ చెయ్యడం వల్ల పిండానికి ప్రమాదమని అనుకుంటారు.

అయితే బాగా వెంటిలేషన్ కలిగిన ప్రదేశంలో కూర్చుని జుట్టుకు రంగేసుకుంటే పెద్ద నష్టం లేదట.

గర్భం ఆరుమాసాల వయసు దాటిన తర్వాత మాత్రమే హెయిర్ డై వేసుకోవడం మంచిదని నిపుణుల సలహా.

కెఫిన్ ను జీర్ణం చెయ్యడానికి కావల్సిన మెకానిజం పిండానికి ఉండదు. కనుక కాఫీ, టీల వినియోగం విషయంలో జాగ్రత్త గా ఉండాలని చెబుతున్నారు.

కెఫిన్ వినియోగం వల్ల బీపీ పడిపోయే ప్రమాదం ఉంటుందట.

పచ్చి మాంసం తినే జంతువులు టాక్సోప్లాస్మా అనే పరాన్నజీవిని మానవులకు సంక్రమింపజేస్తాయి.

పిల్లుల వంటి జీవులకు దూరంగా ఉండడమే మంచిది. వీటి మల మూత్రల వల్ల గర్భస్త శిశువు ప్రాణాలు ప్రమాదంలో పడతాయి.

గర్భవతులు శృంగారంలో పాల్గొన కూడదు అనేది కేవలం అపోహ మాత్రమే.



ప్రత్యేకంగా వైద్యులు సూచిస్తే తప్ప శృంగారానికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు.

Representational Image : Pexels