ప్రణీత ఈజ్ బ్యాక్, బిడ్డ పుట్టిన తర్వాత తొలిసారి ఇలా..

ప్రెగ్నెన్సీ వల్ల ప్రణీత సుభాష్ రంగుల లోకానికి దూరంగా ఉన్నారు.

తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్‌పై గ్రీన్ కోట్ ధరించి ప్రత్యక్షమయ్యారు.

కళ్లు జిగేల్ అనిపించే అందంతో ప్రణీత.. సంతూర్ మమ్మీలా మెరిసిపోతున్నారు.

ప్రణీత సుభాష్.. ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

ఇటీవలే ప్రణీత తన బిడ్డ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

చాలా రోజుల గ్యాప్ తర్వాత ప్రణీత మళ్లీ బాహ్య ప్రపంచానికి వచ్చారు.

ఓ మొబైల్ ఫోన్ కార్యక్రమ వేడుకలో పాల్గొని అభిమానులను అలరించారు.

ప్రణీత కేవలం నటి మాత్రమే కాదు, సామాజిక సేవకురాలు కూడా.

ప్రణీత కొన్ని ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకోవడమే కాకుండా మోడ్రనైజ్ చేయించారు.

రూ.8 లక్షలతో ప్రణీత కర్ణాటకలో 13 స్కూళ్లకు మరమ్మత్తులు చేయించారు.

Images Credit: Pranitha Subhash/Instagram