‘లైగర్’ మూవీ కంటే.. ఇప్పుడు అనసూయ వ్యాఖ్యలే బాగా వైరల్ అవుతున్నాయి. ‘లైగర్’ రిలీజ్ తర్వాత ఆమె చేసిన ట్వీట్ పెద్ద దుమారమే రేపింది. అమ్మని అన్న ఉసురు ఊరికే పోదంటూ అనసూయ ట్వీట్ చేశారు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా అని కామెంట్ చేశారు. అనసూయ ఆ ట్వీట్‌ను రౌడీ బాయ్‌ను ఉద్దేశించే చేశారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఐదేళ్ల కిందట ‘అర్జున్ రెడ్డి’లోని ఓ అభ్యంతరకర డైలాగ్‌పై అనసూయ గళం విప్పారు. అమ్మను తిడుతూ సినిమాలో ఉన్న బూతు డైలాగ్‌పై అనసూయ ఫైర్ అయ్యారు. దీనిపై టీవీ చానళ్లలో పెద్ద డిబేట్ జరిగింది. అప్పటినుంచి వారి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. అయితే, ఆ గొడవ అప్పటితో ఆగిపోయిందని అంతా భావించారు. కానీ, తాజా ట్వీట్‌తో అనసూయ ఇంకా అప్పటి సంగతులు మరిచిపోలేదని స్పష్టమవుతోంది. Image Credit: Anasuya Bharadwaj and Arjun Reddy Movie