టీనేజ్ లోనే హీరోయిన్ గా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది తమన్నా. కెరీర్ ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల జోరు పెరిగినప్పటికీ ఆమె అవకాశాలు తగ్గలేదు. ఓ పక్క సినిమాలు, మరోపక్క వెబ్ సిరీస్ లు అంటూ బిజీగా గడుపుతోంది. ఈ మధ్యకాలంలో ఈమె నటించిన కొన్ని వెబ్ సిరీస్ లు విడుదలయ్యాయి. త్వరలోనే 'గుర్తుందా శీతాకాలం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ తన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తమన్నా లేటెస్ట్ ఫొటోలు