టిక్ టాక్ స్టార్ గా మంచి ఫేమ్ తెచ్చుకున్న సోనాలి ఫొగాట్‌.. హర్యాణా బీజేపీ  నేతగా ఎదిగారు. 

42 ఏళ్ల వయసు గల ఆమె గోవాలో హార్ట్ ఎటాక్ తో మరణించడం అభిమానులను కలచివేస్తోంది. 

2006లో టీవీ యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన సోనాలి.. మెల్లగా టిక్ టాక్ వీడియోలతో వైరల్ అయ్యారు. 

తక్కువ సమయంలోనే ఆమెకి మంచి పాపులారిటీ దక్కింది. 

2019లో బీజేపీలో చేరిన ఆమె.. హర్యానా ఎన్నికల్లో అదంపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

2020లో బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఈ షోలో ఆమె ఎన్నో విషయాలను చెప్పారు. 

తనకు నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఉండేదని.. కానీ ఇంట్లో వాళ్లు పెళ్లి చేయడంతో నటించడం కుదరలేదని తెలిపారు. 

పెళ్లి తరువాత హర్యానాలోని దూరదర్శన్ లో హిందీ యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టారు. 

ఆ తరువాత 2016 డిసెంబర్ లో ఆమె భర్త సంజయ్ ఫొగాట్ మృతి చెందారు.

అతడి మరణానానికి గల కారణం ఏంటో ఇప్పటికి క్లారిటీ లేదు. ఇప్పుడు సోనాలి కూడా మృతి చెందారు. 

హార్ట్ ఎటాక్ అని వైద్యులు చెప్పిన్నప్పటికీ సోనాలి సోదరి అందులో నిజం లేదని, సీబీఐ ఎంక్వయిరీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు.