విజయ్ దేవరకొండ నటుడిగా తన టాలెంట్ ను నిరూపించుకున్నారు.

'ఎవడే సుబ్రహ్మణ్యం', 'పెళ్లిచూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' ఇలా ఒక్కో సినిమాలో ఒక్కో వేరియేషన్ చూపించాడు. 

కానీ ఆ తరువాత ఆ స్థాయి హిట్టు కొట్టలేకపోయారనే చెప్పాలి. 

'ట్యాక్సీవాలా', 'డియర్ కామ్రేడ్' సబ్జెక్ట్స్ పరంగా చాలా మంచివే కానీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. 

'నోటా', 'వరల్డ్ ఫేమస్ లవర్' వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

'లైగర్' కోసం విజయ్ చాలా కష్టపడ్డాడు. కానీ రిజల్ట్ అనుకున్నట్లుగా రాలేదు.

టాలెంట్ పరంగా ఏమాత్రం తక్కువ లేని యాక్టర్ కు నాలుగేళ్లుగా సరైన హిట్ లేకపోవడం ఏంటి..?   

సినిమాల జడ్జిమెంట్ విషయంలో విజయ్ ఏమైనా తప్పు చేస్తున్నాడా..? లేక సినిమా అవుట్ పుట్ సరిగ్గా రావడం లేదా..?

ఇప్పుడు విజయ్ నుంచి రాబోయే సినిమాలు జనగణమన, ఖుషి. లైగర్ రిలీజ్ కాకముందే జనగణమన అనౌన్స్ చేశారు.

విజయ్ కెరీర్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాలంటే ఈ రెండు సినిమాలు కచ్చితంగా హిట్ అవ్వాల్సిందే.