విక్రమాదిత్య తెలియకపోవడం ఏంటమ్మా? ఈయన శాస్త్రం చెబితే శాసనం అంటారు! ప్రామిస్ట్రీకి ఐన్‌స్టీన్‌ లాంటివారు!  - ట్రైన్ సీన్‌లో ఓ ఆర్టిస్ట్

రేపు మంచి జరుగుతుందని తెలిస్తే... స‌ర్‌ప్రైజ్ మిస్ అవుతారు! చెడు జరుగుతుందని తెలిస్తే హోప్ మిస్ అవుతారు! - ప్రభాస్

జరిగేది మారినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోకపోవడమే మంచిది సార్! - ప్రభాస్ 

ఫ్ల‌ర్టేష‌న్‌షిప్‌? - పూజా హెగ్డే
ప్రేమ‌లో ఉండే అన్నీ చేసుకుంటారు. కానీ, ప్రేమించుకోరు! - ప్ర‌భాస్‌

ఈ డాక్టర్స్, రిపోర్ట్స్, మెషీన్స్ ఏం చెప్తున్నాయో నాకు తెలియదు ప్రేరణ! నేను ఇప్పటివరకూ చెప్పిన జోతీష్యం ఎప్పుడూ తప్పు కాలేదు. నీ విషయంలో కూడా అవ్వడు! - పూజా హెగ్డేతో ప్రభాస్ 



ఏ శాస్త్రం నూటికి నూరుపాళ్లు కరెక్ట్ కాదు! నువ్వు నమ్మినా, నమ్మకపోయినా ఇదే నిజం! - విక్రమాదిత్య(ప్రభాస్)తో కృష్ణంరాజు

ఎప్పుడైనా ఈ శాస్త్రం తప్పు అవ్వడం చూశారా గురువుగారూ? నేను చెప్పేది జోస్యం ఒక్కసారైనా తప్పు అయితే చూడాలని వెయిట్ చేశా! - ప్రభాస్

ప్రేరణను కలిసిన తర్వాత నా శాస్త్రం తప్పు అనే ఆలోచన కూడా భరించలేకపోతున్నాను. నేను తనకు చెప్పిన జోస్యం వందశాతం రైటై తీరాలి - ప్రభాస్ 



నాకు చావు అంటే చాలా భయం. ఆ భయం పోవడానికి రోజూ రెండు నిమిషాలు చావును ప్రాక్టీస్ చేస్తాను! - ప్రభాస్

నాకు ఏదీ రెండోసారి చూసే అలవాటు లేదు! - ప్రభాస్ 

పాలిటిక్స్‌లో మీ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది, ఫ్యూచర్ కాదు! మీరు ఎంత ట్రై చేసినా పొలిటిషన్ అవ్వలేరు! - జగపతి బాబుతో ప్రభాస్ 

నేను ప్రేమలో పడను. నాకు ఈ రిలేషన్షిప్స్ పడవు - ప్రభాస్ 

నాకు పుట్టుక నుంచి చావు దాకా ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు! - ప్రభాస్ 

ఇవీ 'రాధే శ్యామ్'లో ముఖ్యమైన డైలాగ్స్. ప్రభాస్, పూజా హెగ్డే మధ్య లవ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. అవీ బావుంటాయి.