మేషం కార్యాలయంలో మీ ప్రభావం పెరుగుతుంది. మీకు అప్పగించిన బాధ్యతను సకాలంలో పూర్తిచేస్తారు. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుతాయి. స్నేహితులను కలుస్తారు. పనికిరాని చర్చల్లో మీ సమయాన్ని వృథా చేసుకోకండి. వ్యాపారంలో మందగమనం దూరమవుతుంది.
వృషభం ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వ్యక్తులను కలుస్తారు. రోజంతా సంతోషంగా ఉంటారు. ఆనందం, సంపద పెరుగుతుంది. తెలియని వ్యక్తుల పట్ల మీ పనికి ఆటంకం కలగవచ్చు. మీ జీవితభాగస్వామితో సమయం గడిపే సమయం మీకు దొరుకుతుంది.
మిథునం ఈ రోజు మీకు కష్టతరంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. కొన్ని విమర్శలు ఎదుర్కొంటారు. డబ్బులు జాగ్రత్తగా దాచండి. మాటను అదుపులో ఉంచుకోవాలి.
కర్కాటకం గత కొన్ని రోజులుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి. మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. చికిత్స కోసం ఖర్చు కావొచ్చు. వ్యాపారానికి సంబంధించి విహారయాత్రకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు.
సింహం ప్రభుత్వ పనుల్లో విజయం సాధిస్తారు. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి షికారుకి వెళతారు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈరోజు ఆహ్లాదకరమైన రోజు అవుతుంది. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. ఒత్తిడికి లోనుకావొద్దు.
కన్య ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మందులు తీసుకోవడంలో అజాగ్రత్త వహించకండి. ఇల్లు లేదా భూమిని కొనుగోలు చేయవచ్చు. వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యక్తులు లాభపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి.
తుల ఈ రోజు మీరు కొన్ని పనిలు త్వరగా పూర్తి చేయాలనే ప్రయత్నంలో తప్పులు చేస్తారు. కార్యాలయంలో ఎవరితోనైనా మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. మీరు స్నేహితుల మద్దతు పొందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి.
వృశ్చికం స్నేహితుడి వల్ల టెన్షన్ పడతారు. ఏదైనా నష్టానికి బాధ్యత ఇతరులకు అప్పగించవద్దు.మీ పని తీరులో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించండి. యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రేమికులకు మంచి రోజు.
ధనుస్సు ఈరోజు మీరు విమర్శల పాలవుతారు..కానీ..కోప్పడకండి. మాట్లాడేటప్పుడు తప్పుడు పదాలు వాడొద్దు. మార్గనిర్ధేశం చేసే వ్యక్తిని కలుస్తారు. పాతసమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులు మంచి కెరీర్ కోసం మరింత కష్టపడాలి.
మకరం ఉపయోగం లేని విషయాలకు ఎక్కువ సమయం కేటాయించవద్దు. పనికిరాని చర్చల్లో పాల్గొనవద్దు. ఈరోజు మీ మనస్సు కలవరపడవచ్చు. బంధువుల నుంచి విచారకరమైన సమాచారం అందుతుంది. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. జాగ్రత్తగా ఖర్చు పెట్టండి.
కుంభం ప్రేమికులకు ఈరోజు ఆహ్లాదకరమైన రోజు. మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. చాలా కాలం తర్వాత బంధువులను కలుస్తారు. మీ ఆఫీసు పనులు సులువుగా పూర్తవుతాయి. విహారయాత్రకు వెళ్లాల్సి రావొచ్చు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.
మీనం మీ అలవాట్ల కారణంగా మీరు ఈ రోజు బాధపడాల్సి రావొచ్చు. కోపాన్ని నియంత్రించుకోవడం నేర్చుకోండి. మీరు మీ పిల్లలతో గొడవ పడే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి కలత చెందుతారు. ఆఫీసులో మరింత బాధ్యత ఉంటుంది. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి.