టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే చిన్నప్పటి ఫొటోస్

నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై “ముకుంద” సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది.

అరవింద సమేత, అలవైకుంఠపురం, మహర్షి సినిమాలతో కెరీర్లో దూకుడు మరింత పెంచింది.

పూజా నటించిన రాధే శ్యామ్, ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉండగా..మరికొన్ని ప్రాజెక్టుల్లో బిజిగా ఉంది.

పూజా హెగ్డే అక్టోబరు 13, 1990న ముంబై లో జన్మించింది. తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్డే, లతా హెగ్డే.

ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కొద్దిగా కన్నడ, తమిళ్ మాట్లాడగలదు. పూజా భారతనాట్యంలో కూడా శిక్షణ పొందింది.

ముంబై లోని ఎంఎంకే కాలేజ్‌లో కామర్స్ లో ఉన్నత విద్య చదివింది. కాలేజ్ ప్రోగ్రామ్స్ , డాన్స్ షోస్, ఫ్యాషన్ షోలో పాల్గొనేది.

2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది.

పూజాకు ఏదైనా కష్టం వచ్చినపుడు 15 నిముషాలు ఏడుస్తుందట, ఆ తర్వాత ఆ కష్టం నుంచి వచ్చే నెగెటివ్ థాట్స్ అన్ని పోతాయంటుంది