నేడు (అక్టోబర్ 13) టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే పుట్టిన రోజు. దశాబ్ద కాలంగా సినీ అభిమానులను అలరిస్తున్న ఈ భామ, ఈరోజు 34 ఏట అడుగుపెడుతోంది. బర్త్ డే సెబ్రేషన్స్ కోసం ఒక రోజు ముందుగానే మాల్దీవులకు వెళ్ళింది పూజా. 'ప్రస్తుతానికి అందుబాటులో లేను' అంటూ తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అందులో సముద్ర జలాలపై ఏర్పాటు చేసిన బెడ్ మీద నిద్రిస్తూ కనిపించిందీ ముద్దుగుమ్మ. థైస్ కనిపించేలా పొట్టి డ్రెస్ వేసుకొని పవళిస్తున్న అమ్మడి అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 'మాస్క్' అనే తమిళ్ మూవీతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది పూజా హెగ్డే. 'ఒక లైలా కోసం' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి, అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. 'రాధేశ్యామ్' 'బీస్ట్' 'సర్కస్' 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' సినిమాలు నిరాశ పరిచాయి. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలతో సందడి చేస్తూ వస్తోంది.