అప్పటికప్పుడు అటుకుల దోశె ఇలా చేసేయండి

అటుకులు - ఒక కప్పు
పెరుగు - పావు కప్పు
బొంబాయి రవ్వ - అర కప్పు
వంట సోడా - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత

ఒక గిన్నెలో అటుకులు ముందు నానబెట్టుకోవాలి. ఇది పావుగంటలో నానిపోతాయి.

అలాగే బొంబాయి రవ్వ కూడా వేయించకుండానే నీళ్లలో నానబెట్టుకోవాలి.

రెండూ పావు గంట నానాక మిక్సీలో రెండింటినీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో పెరుగు వేసి బాగా కలపాలి.

దీనిలో ఉప్పు, చిటికెడు వంట సోడా కలిపి ఓ పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

పెనంపై నూనె రాసి దోశెల్లా పలుచగా వేసుకోవాలి.

వీటిని కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.