కాకరకాయ అనగానే చాలా మంది ఇష్టం లేదని చెప్తారు. కారణం చేదుగా ఉండటమే. కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.



కాకరకాయలో విటమిన్ ఎ, బి, సి పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటూ ఐరన్, పొటాషియం, జింక్, మెగ్నీషియం, మాంగనీస్ కూడా లభిస్తాయి.



మధుమేహులు కాకరకాయ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.



గర్భిణులు తీసుకోవడం వల్ల జేస్టేషనల్ డయాబెటిస్ రాకుండా అడ్డుకుంటుంది. మలబద్ధకం సమస్య తొలగిస్తుంది.



గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. హృదయ సంబంధ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది.



బరువు అదుపులో ఉంచుతుంది. ప్రతిరోజు కాకరకాయ రసం తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.



జలుబు, దగ్గు, శ్వాససమస్యలు, ఆస్తమా వంటి వాటికి కూడా కాకరకాయ బాగా పనిచేస్తుంది.



జ్యూస్ తాగడం వల్ల అందులోని చేదు గుణం శరీరం నుంచి వ్యర్థాలని బయటకి పంపిస్తుంది. చర్మం కాంతివంతంగా చేస్తుంది.



రోగనిరోధక శక్తి పెంచుతుంది. క్యాన్సర్ కణాలని సమర్థవంతంగా అడ్డుకుంటుంది.
Images Credit: Pixabay/ pexels