ఇన్‌స్టెంట్‌గా అటుకుల గారెలు

అటుకులు - ఒక కప్పు
పెరుగు - పావు కప్పు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చి మిర్చి - రెండు
కరివేపాకులు - గుప్పెడు

బియ్యప్పిండి - రెండు స్పూన్లు
కొత్తిమీర తరుగు- రెండు స్పూన్తు
అల్లం పేస్టు - అర స్పూను
నూనె - వేయించడానికి సరిపడా
ఉప్పు - రుచికి సరిపడా

ఒక గిన్నెలో అటుకులు, నీళ్లు పోసి నానబెట్టాలి. అవి నానాక నీళ్లు ఒంపేసి, అటుకులను ముద్దలా మెదుపుకోవాలి.

ఆ గిన్నెలోనే పెరుగు, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకులు సన్నగా తరిగి కలుపుకోవాలి.

తరువాత ఆ మిశ్రమంలో అల్లం పేస్టు, కొత్తిమీర తరుగు, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి.

మిశ్రమం గారెల్లా వేసుకోవడానికి వీలుగా వచ్చేలా కలుపుకోవాలి.

కళాయిలో నూనె వేడెక్కాక గారెల్లా ఒత్తుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి.

వీటిని కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.