మట్టిపాత్రల్లో వండితే ఎంతో రుచి మట్టి కుండలో వండేటప్పుడు ఆహారంలో ఉండే పోషకాలు నశించవు. పోషకాలన్నీ ఆహారంలోనే పదిలంగా ఉంటాయి. మట్టి కుండలు ఆల్కలీన్ స్వభావం కలిగి ఉంటాయి.దానివల్ల PH బ్యాలెన్స్ అవుతుంది. వీటిలో వండడం వల్ల నూనె తక్కువ పడుతుంది. నూనె తక్కువగా వాడడం ఎంతో ఆరోగ్యం కూడా. ఈ పాత్రల్లో ఉండే ఆహారం రుచి అద్భుతంగా ఉంటుంది. ఒక భిన్నమైన వాసనను కలిగి ఉంటుంది. వీటిలో వండిన ఆహారం తినడం వల్ల జీర్ణ ప్రక్రియ కూడా సాఫీగా సాగుతుంది. అజీర్ణం, గ్యాస్ సమస్య వంటివి రావు. మట్టికుండల్లో వండిన ఆహారం తినడం వల్ల మన పూర్వీకులు అంత బలంగా ఉన్నారని చెబుతారు. పోషకాహార నిపుణులు కూడా మట్టి కుండల్లో వండుకుని తినమని సూచిస్తున్నారు. మట్టి కుండల్లో ఆహారాన్ని వండి, వడ్డించినప్పుడు మంచి సువాసనే కాదు, ఆరోగ్యం పై మంచి ప్రభావం కనిపిస్తుంది.