జీడిపప్పు తింటే కొవ్వు పేరుకుపోతుందని భయపడుతుంటారు. కానీ మోతాదు ప్రకారం తీసుకుంటే చాలా మేలు చేస్తుంది.

విటమిన్స్ ఎ, ఇ, కే, రాగి, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రోటీన్లు, పిండి పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి.

రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్స్ బారి నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. జ్ఞాపక శక్తిని మెరుగ్గా ఉండేలా చేస్తుంది.

కొలెస్ట్రాల్ తగ్గించి రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.

గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్స్ రక్త నాళాలు బలంగా తయారయ్యేందుకు దోహదపడతాయి.

మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించడంలో సహాయపడతాయి.

జింక్‌ పుష్కలంగా లభిస్తుంది. ఇది మగవారిలో స్పెర్మ్ కౌంట్‌ను మెరుగుపరుస్తుంది, తద్వారా సంతానోత్పత్తిని పెంచుతుంది.

కండరాలకు అవసరమయిన కొల్లాజెన్ ని ఇది అందించి ఎముకలు ధృడంగా ఉండేలా చేస్తుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు జీడిపప్పును రోజుకు కేవలం 3-4 కి పరిమితం చెయ్యాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

శరీరంలోని అవయవాల పనితీరుకే కాదు చర్మం, వెంట్రుకలకి కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.
Image Credit: Pexels