రక్తపోటు తగ్గాలా? స్ట్రాబెర్రీలు తినండి రక్తపోటు పెరగకుండా ఉండాలంటే రోజూ రెండు స్ట్రాబెర్రీలు తినడం అలవాటు చేసుకోవాలి. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు కూడా స్ట్రాబెర్రీలు తింటే మేలు జరుగుతుంది. ఈ పండ్లు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. చెడుకొలెస్ట్రాల్ పేరుకుపోకుండా కాపాడుతుంది కాబట్టి గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. పిల్లలు, గర్భిణులు కచ్చితంగా ఈ పండ్లను తినాలి. ఇవి రోగినిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాదు వయసు పెరుగుతున్నా కొద్దీ వచ్చే మతిమరుపు కూడా రాదు. ఈ పండ్లలో ఉన్న ఫ్లేవనాయిడ్స్ కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి. చర్మసౌందర్యాన్ని ఇవి పెంచుతాయి.