ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లో శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించారు ఢిల్లీ నుంచి పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి లేపాక్షి ఆలయానికి వెళ్లి వీరభద్రస్వామిని దర్శించుకున్నారు నేషనల్ కస్టమ్స్, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ అకాడమీ (నాసిన్)ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏపీకి నాసిన్ లాంటి వరల్డ్ క్లాస్ ఇన్ స్టిట్యూట్ రావడం గవర్వంగా ఉందన్న ఏపీ సీఎం జగన్ గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో 44వ జాతీయ రహదారికి ఆనుకుని 503 ఎకరాల విస్తీర్ణంలో ఉంది నాసిన్ అకాడమీని ఏపీలో ఏర్పాటు చేసినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు అంతర్జాతీయ ప్రమాణాలతో నాసిన్ శిక్షణ కేంద్రాన్ని రూ.541 కోట్లతో నిర్మించారు. బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి ఈ అకాడమీకి గంట సేపట్లో చేరుకునేంత దూరం ఉంటుంది. నాసిన్ కొత్త క్యాంపస్ దేశంలో వాణిజ్యం, పరిశ్రమలకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని మోదీ ధీమాగా ఉన్నారు.