విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రమాదానికి ఇంటర్ లాకింగ్ సిస్టమ్ వైఫల్యం కారణం కాదని స్పష్టం చేశారు. విశాఖ - రాయగడ ప్యాసింజర్ లోకోపైలట్ సిగ్నల్ గమనించకుండా వేగంగా వెళ్లడంతోనే ప్రమాదం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన సీఎం జగన్ బాధితులను పరామర్శించారు కంటకాపల్లి వద్ద విశాఖ - పలాస రైలును వెనుక నుంచి విశాఖ - రాయగడ రైలు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 14 మంది మృతి చెందగా, 100 మందికి గాయాలు పలాస, రాయగడ ప్యాసింజర్ రైలులో మొత్తం 1400 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది ఈ జూన్ లో ఒడిశా, బాలాసోర్ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది