నిజం గెలవాలి పేరుతో మరో కార్యక్రమాన్ని టీడీపీ చేపట్టనుంది

ఆదివారం రాత్రి 7 గంటలకు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చేపట్టాలని పిలుపునిచ్చింది.

చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ టీడీపీ వినూత్న నిరసనలకు పిలుపునిస్తోంది.

అక్టోబర్ 29 రాత్రి 7 గంటలకు కళ్ళకు గంతలు కట్టుకుందాం. నిజం గెలవాలి గట్టిగా అరుద్దామని పిలుపు

వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి చంద్రబాబుకి మద్దతుగా నిరసన

వీటిలో పార్టీ నేతలు, స్థానికంగా చురుగ్గా ఉండే కార్యకర్తలే తరచూ పాల్గొంటున్నారు.

చంద్రబాబు అరెస్టు తర్వాత ఈ వాతావరణం మారిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి

చంద్రబాబు అరెస్టు అయ్యి ఇప్పటికి 50 రోజులైనా టీడీపీ శ్రేణులు నిరసనల్లో విశ్రమించలేదు.

రిలే నిరాహార దీక్షలు, కొవ్వొత్తుల ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు అవిశ్రాంతంగా కొనసాగిస్తున్నారు.