నటుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఎన్టీఆర్ సేవలకు గుర్తింపుగా, స్మారకంగా రూ.100 కాయిన్ కేంద్రం తీసుకొచ్చింది

ఈ నాణేలు మార్కెట్లో చలామణిలో ఉండవు. ఎన్టీఆర్ కు గుర్తుగా దాచుకోవడానికి మాత్రమే

ఎన్టీఆర్ పేరు మీద రూ. 100 నాణెన్ని విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఈ నాణెం విలువ రూ.100, కానీ నాణెం ధర రూ.3500 నుంచి రూ. 4,850 వరకు ఉంది

ఎన్టీఆర్ నాణేన్ని 4 లోహాల మిశ్రమంతో తయారు చేసినట్లు హైదరాబాద్ మింట్ తెలిపింది

నాణెం తయారీకి 50 శాతం వెండి, 40% రాగి - నికెల్, జింక్ 5 శాతం చొప్పున వాడారు

ఆగస్టు 29 ఉదయం 10 గంటల నుంచి ఎన్టీఆర్ నాణేలను కొనుగోలు చేయవచ్చు

ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో పాటు ఆయన సన్నిహితులు కార్యక్రమంలో పాల్గొన్నారు

ఎన్టీఆర్ నాణెం తయారీకి సుమారు రూ. 4 వేలు ఖర్చు అవుతుంది

ఎన్టీఆర్ స్మారక నాణేలను తొలి విడతలో 12 వేలు తయారు చేశారు.