వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. వైఎస్ షర్మిలతో పాటు ఆమె భర్త బ్రదర్ అనిల్ సైతం ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో వైఎస్ షర్మిలకు పలువురు నేతలు ఘన స్వాగతం పలికారు. బుధవారం రాత్రి షర్మిల, ఆమె భర్త అనిల్ ఢిల్లీలోనే బస చేయనున్నారు. గురువారం ఉదయం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. షర్మిల తన పార్టీ YSRTPని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారు. ఆమె కాంగ్రెస్ లో చేరడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్న కాంగ్రెస్ పెద్దలు షర్మిలతో పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తున్నారు గురువారం ఉదయం ఏఐసీసీ అగ్రనేతలతో షర్మిల భేటీ కానున్నారు. అనంతరం కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయనున్నారు బుధవారం సాయంత్రం షర్మిల తన భర్త బ్రదర్ అనిల్, కుమారుడు రాజారెడ్డితో కలిసి తాడేపల్లికి వెళ్లారు. కుమారుడు రాజా రెడ్డి ఎంగేజ్ మెంట్, వివాహానికి హాజరు కావాలని సోదరుడు జగన్ ను షర్మిల ఆహ్వానించారు.