Michaung Cyclone in AP: మిగ్ జాం తుపాను బాపట్ల వద్ద తీరం దాటింది.

తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచాయి

తుపాను తీరం దాటిన సమయంలో బాపట్ల తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో అలలు భారీ ఎత్తున ఎగిసి పడుతున్నాయి.

మిగ్ జాం తుపాను తీవ్రత కారణంగా 11 జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు

భారీ వర్షాలతో పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. పలు చోట్ల ఈదురు గాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి

నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లోనూ నష్టం ఎక్కువగా జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు

కోనసీమ జిల్లాలో దాదాపు 9 వేల ఎకరాలపై తుపాను ప్రభావం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

నెల్లూరు నుంచి కాకినాడ జిల్లాల వరకు బుధవారం సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు

తుపాను ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, కాకినాడ, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.