తెల్ల వెంటుకలను పీకితే మరిన్ని పెరుగుతాయని చాలామంది చెబుతుంటారు. మరి, ఇందులో నిజం ఏమిటీ? అసలు తెల్ల వెంటుకలు ఎందుకు వస్తాయి? హెయిర్ ఫోలిక్స్ చుట్టూ ఉండే మెలనోసైట్స్.. మెలనిన్ ఉత్పత్తి చేస్తాయి. మెలనిన్ వల్ల జుట్టు నల్లగా, బలంగా ఉంటుంది. మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోయినప్పుడు జుట్టు క్రమేనా తెల్లగా మారుతుంది. సాధారణంగా వయస్సు పెరిగినప్పుడు మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అలాగే ఒత్తిడి, రసాయనాలు కలిగిన షాంపూలు వాడటం వల్ల కూడా జుట్టు తెల్లబడుతుంది. కానీ, తెల్ల వెంటుకలను పీకడం వల్ల జుట్టు తెల్లబడుతుందనేది మాత్రం అవాస్తవం. Images Credit: Pexels