2023లో అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన ఆటగాళ్లు వీరే. 2,123 పరుగులతో శుభ్‌మన్ గిల్ అత్యధిక పరుగుల్లో టాప్‌లో ఉన్నారు. న్యూజిలాండ్ ఆటగాడు డేరిల్ మిషెల్ 1,956 పరుగులతో తర్వాతి స్థానంలో నిలిచాడు. కింగ్ కోహ్లీ 1,934 పరుగులతో మూడో స్థానం దక్కించుకున్నాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 1,795 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. బౌలర్ల విషయానికి వస్తే... రవీంద్ర జడేజా 66 వికెట్లతో టాప్‌లో నిలిచాడు. రెండో స్థానంలో కూడా భారతీయ బౌలర్ కుల్దీప్ యాదవే (63) ఉన్నాడు. ఐర్లాండ్ బౌలర్ మార్క్ ఆడర్ (59) మూడో ప్లేస్ దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియన్ పేసర్ మిషెల్ స్టార్క్ (59) నాలుగో స్థానంలో ఉన్నాడు. ఐదో ప్లేస్‌లో 58 వికెట్లతో మహ్మద్ సిరాజ్ నిలిచాడు.