ఈ ఐదు మొక్కలు మీ ఇంట్లో ఉంటే ఆరోగ్యానికి మంచిది మొక్కలు పెంచుకోవడం ఇష్టమా ? అయితే వీటి గురించి మీరు తెలుసుకోవాల్సిందే కలబంద: ఈ మొక్కలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. ఈ ఆకులోని జెల్ కాలిన చర్మాన్ని, ముఖం మీద మొటిమలకు మందులా పనిచేస్తుంది. లావెండర్: ఈ మొక్క నుంచి వచ్చే వాసన ఆందోళన, నిద్రలేమి చికిత్సకు సహాయపడుతుంది. స్నేక్ ప్లాంట్: మీ ఇంట్లోని గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. విషపూరితమైన గాలిని తొలగించి, స్వచ్ఛమైన గాలిని ఉత్పత్తి చేస్తుంది. రోజ్ మేరి : ఇందులోని ఆయిల్స్ మీ మెమరీ పవర్ మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. స్పైడర్ ప్లాంట్ : గాలి నాణ్యత పెంచడంతోపాటు గాలిలో ఉండే రసాయనాలను తొలగిస్తుంది. ఇంటి ఫర్నిచర్, రబ్బరు, పెయింట్ నుండి ఏర్పడే రసాయనాలను ఈ మొక్క తొలగిస్తుంది.