మొదటి ప్రపంచ యుద్ధంలో పిన్ని స్వీటు

పిన్ని అనేది పంజాబీలు ఇష్టంగా తినే ఒక స్వీటు.

పిన్ని స్వీటుకు, మొదటి ప్రపంచ యుద్ధానికి ఎంతో సంబంధం ఉంది. ఆ బంధాన్ని ఇప్పటికీ పంజాబీలు మర్చిపోరు.

మొదటి ప్రపంచ యుద్ధం 1914లో మొదలై 1918 వరకు సాగింది. చరిత్రలో అత్యంత ఘోరమైన యుద్ధాల్లో ఇదీ ఒకటి.

ఆ సమయంలో మనదేశాన్ని బ్రిటన్ పాలిస్తోంది. బ్రిటిష్ వారు మన దేశం నుంచి సైనికులను యూరోప్‌కు పంపారు.

చల్లని ప్రాంతాల్లో ఉండలేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ సైనికుల్లో ఎంతో మంది పంజాబీలు కూడా ఉన్నారు.

తాము ఆ చలిని తట్టుకుని యుద్ధం చేయాలంటే తమకు ‘పిన్ని’ స్వీటును పంపించాలని వారు డిమాండ్ చేశారు.

చల్లని వాతావరణంలో ఆ స్వీటు తినడం వల్ల శరీరానికి వెచ్చదనం రావడంతో పాటూ, పోరాడే శక్తి కూడా పెరుగుతుంది.

దీంతో పిన్ని స్వీటును భారీగా తయారు చేయించి, యూరోప్ దేశాలకు పంపించారు బ్రిటిష్ అధికారులు.