ఇంటర్నెట్‌లో ఒక స్కామ్ ముగిసిందనేలోపే కొత్త స్కామ్ వెలుగు చూడటం కామన్ అయిపోయింది.

ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న స్కామ్‌ల్లో ‘పింక్ వాట్సాప్’ స్కామ్ ఒకటి.

ఈ స్కామ్‌లో మోసగాళ్లు ఎక్కువ ఫీచర్లతో వస్తున్న ‘పింక్ వాట్సాప్’ డౌన్‌లోడ్ చేసుకోమని లింక్ పంపుతారు.

కానీ ఈ యాప్‌లో డేంజరస్ మాల్‌వేర్ ఉంటుంది.

ఈ యాప్ మీ ఫ్రెండ్ దగ్గర నుంచి వచ్చినా డౌన్‌లోడ్ చేయకండి.

ఎందుకంటే ఒకసారి మీరు ఈ లింక్ నుంచి డౌన్‌లోడ్ చేస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ వెళ్లిపోతుంది.

కానీ అది పంపిన విషయం మీకు కూడా తెలియదు.

మీ ఓటీపీ, కాంటాక్ట్స్, బ్యాంక్ డిటైల్స్ అన్నీ వారి దగ్గరకు వెళ్లిపోతాయి.

కానీ ఈ ప్రమాదం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే.

ఎందుకంటే ఐఫోన్లలో థర్డ్ పార్టీ యాప్స్ ఇన్‌స్టాల్ చేయడం అస్సలు సాధ్యం కాదు.