డయాబెటిస్‌తో బాధపడేవారు ఆహారం విషయంలో చాలా గందరగోళానికి గురవ్వుతారు.

డయాబెటిస్ వస్తే.. ఏది తినాలన్నా భయమే. చివరికి వేరు శనగలు తినాలన్నా ఆలోచిస్తారు.

వాస్తవానికి వేరు శనగలు డయాబెటిక్స్‌కు మేలే చేస్తాయి. బరువు తగ్గించేందుకు సహకరిస్తాయి.

వేరు శనగలు శరీరానికి హెల్తీ ఫ్యాట్‌ను అందిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

రక్త నాళాల్లో పేరుకుపోయే కొవ్వులను తొలగించడంలో వేరు శనగలు కీలక పాత్ర పోషిస్తాయి.

ఫలితంగా డయాబెటిస్ రోగులకు గుండె సమస్యల ముప్పు తప్పుతుంది.

వేరు శనగల్లో విటమిన్ B6, విటమిన్ B9, విటమిన్ B కాంప్లెక్స్, ప్రోటీన్స్ ఉంటాయి.

కాబట్టి, ఎలాంటి సంకోచం లేకుండా డయాబెటిస్ బాధితులు వేరు శనగలు తినొచ్చు. చక్కెర, బెల్లంతో తీసుకోవద్దు.

Images Credit: Pexels