ఫొటోషూట్‌లో పాయల్ హొయల్!

పాయల్ రాజ్‌పుత్‌కు అందం, అభినయంతోపాటు అవకాశాలూ దండిగా ఉన్నాయ్.

కానీ, పాయల్‌ను అదృష్టమే వరించడం లేదు. ఏ సినిమా చేసినా ఫ్లాప్ అవుతోంది.

దీంతో పాయల్‌ను అంతా ఐరన్ లెగ్ అంటున్నారు.

పాయల్ ఇటీవల మంచు విష్ణుతో ‘జిన్నా’ మూవీలో నటించిన సంగతి తెలిసిందే.

అయితే, ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.

ఆదితో నటించిన ‘తీస్ మార్ ఖాన్’ మూవీ కూడా ఫ్లాప్ అయ్యింది.

కన్నడ చిత్రం ‘హెడ్‌బుష్’ మూవీ కూడా కలిసి రాలేదు.

దీంతో పాయల్ మళ్లీ అవకాశాల వేటలో పడింది.

ప్రస్తుతం ‘మాయాపేటిక’ మూవీపై ఆశలు పెట్టుకుంది పాయల్.

అయితే, పాయల్ ఫొటోషూట్స్ మాత్రం ఆపడంలేదు.

తాజాగా ఓ ఫొటోషూట్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసింది. ఇదే ఆ వీడియో.

Images and Videos Credit: Payal Rajput/Instagram